నిండు గర్భిణితో ఉందని చూడకుండా ఓ సైకో భర్త భార్యను కర్రతో తలపై కొట్టి చంపాడు.పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.
మద్యానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.కర్రతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావం ఏర్పడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఈ విషాద ఘటన ఒడిశాలోని బొలంగీర్ పట్టణం రాధారాణిపడ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
మోతీలాల్ బారిక్ అనే వ్యక్తి అనాదిని (25) అనే మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది.మోతీలాల్ మద్యానికి బానిసవ్వడంతో భార్యను తీవ్రంగా వేధించేవాడు.అయినా తొమ్మిది నెలల గర్భవతి అయిన అనాదిని పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ కలలు కనేది.ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మోతీలాల్ వంటసాకుతో గొడవకు దిగాడు.
చేపకూర ఎందుకు వండలేదని భార్యతో గొడవపడి ఆవేశంతో కర్ర తీసుకుని అనాదిని తలపై కొట్టాడు.తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అనాదిని సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మోతీలాల్ ను అరెస్ట్ చేశారు.