మనిషి జుట్టు ఎక్కడెక్కడ దొరుకుతుందాని జల్లెడపడుతున్న చైనా?

చైనా దేశం( China ) గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలు ఆ దేశాన్ని అసహ్యించుకున్నాయి.

 Human Hair Exports Big Business In China County Details, China, Human Hair, Hair-TeluguStop.com

విషయం ఏమిటంటే వీరు ప్రపంచ దేశాల్లోని జుట్టును( Hair ) కూడా వదలడం లేదని చాలా మీడియాలలో హాట్ టాపిక్ కధనాలు వెలువడుతున్నాయి.ప్రపంచంలో ఎక్కడ మనిషి జుట్టు ఎక్కువగా లభిస్తుందో అక్కడ ఈ దేశం వాళ్లు వాలిపోయి మరీ కొనుగోలు చేస్తున్నారని వినికిడి.

జుట్టు ఎక్కువగా లభిస్తున్న ఆయా దేశాల బయ్యర్లతో ఒప్పందం కుదుర్చుకొని తక్కువ ధరకు వెంట్రుకలు కొనుగోలు చేస్తున్నారని సమాచారం.

Telugu China, International, Wigs-Latest News - Telugu

అయితే చీప్ గా జుట్టు కొనుక్కోవడం ఏంటండీ… అని వారిని కొట్టి పారేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆ కురులతోనే వారు కోట్లు గడిస్తున్నారు మరి.అవును, వీరు అన్ని దేశాల్లోని తలనీలాలు సమర్పించే ఆలయాల్లోని బయ్యర్లతో లింక్​ పెట్టుకొని తక్కువ ధరకు వెంట్రుకలు కొనుగోలు చేసి వారి దేశంలో వస్తువులు తయారు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.ఈ వెంట్రుకలని వారు ఏయే రకాలుగా వాడుతున్నారంటే, వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రకాల పనిముట్లను తయారు చేస్తున్నారు.అదేవిధంగా రంగులు వేసే బ్రెష్​లు వీటితోనే తయారు చేస్తున్నారు.

Telugu China, International, Wigs-Latest News - Telugu

ఇక విగ్గులు గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.విగ్గులను ఇక్కడ తయారు చేసినట్టు మరీదేశంలోను తయారుచేయలేదని చెప్పుకోవాలి.అలా వాటిని తయారు చేసి మరలా జుట్టుని ఎక్కడైతే కొన్నారో ఆయా దేశాలలోనే వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.ప్రపంచ దేశాలకు లక్షల రూపాయలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొన్ని రకాల విగ్గులు కోట్ల రూపాయల ధర పలుకుతాయని చాలా మందికి తెలియదు.మరీ ముఖ్యంగా కళా రంగాల్లో వీటిని విరివిగా వాడుతారు.మనదేశంలో చాలా సినిమా పరిశ్రమలలో వాడుతున్న విగ్గులు వారు తయారు చేసినవే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube