భారీ బడ్జెట్ సరే.. మరి కంటెంట్ మాటేంటి?.. చచ్చిపోతున్న సినిమా

మొన్నటి వరకూ ఏదైనా సినిమా తీస్తే సినిమా కథ లో ఎంత బలం ఉంది అన్నది ముఖ్యం గా చూసేవారు.నేటి రోజుల్లో సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది అన్నదే ఎక్కువగా చూస్తూ ఉన్నారు.

 Huge Budget Movies In Tollywood With No Content Salaar Liger Janaganamana Hari H-TeluguStop.com

ఇక ఇది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.50 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సినిమా కి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు.150 రూపాయలు వస్తుంది అని అనుకుంటున్నారు కానీ తీరా చూస్తే వంద రూపాయలు కూడా రాని పరిస్థితి నెలకొంది.

సినిమా బాగానే హీరో హీరోయిన్లు పక్కకి తప్పుకుంటారు.దర్శకుడు పరిస్థితి కూడా అంతే.ఇక నిర్మాత అంటారా అప్పటికే థియేట్రికల్ రైట్స్, ఓటీటీ అంటూ ఖర్చు పెట్టినంత వసూలు చేస్తారు.కానీ ఆ తర్వాత నష్టాలు వచ్చేది మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు.

అయితే ఇటీవలి కాలంలో ఓటిటి హవా కూడా పెరిగిపోయింది.ఇంటికి సరుకు వస్తుండడంతో ఇక ఎంతో కష్టపడి థియేటర్కి వెళ్లి సినిమా చూడ్డానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.

తద్వారా ఇక ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టాలి అంటే ఆ సినిమాలో ఏదో అద్భుతం ఉండాల్సిందే అన్న విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి.

Telugu Salaar, Harihara, Budget, Janaganamana, Liger, Mahesh Babu, Ntr Koratala,

ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు భారీ బడ్జెట్ సినిమాలు చాలానే సిద్ధంగా ఉన్నాయి.సలార్, ప్రాజెక్టు కె, చరణ్ శంకర్ కాంబినేషన్ లో ని ప్రాజెక్ట్, ఎన్టీఆర్ కొరటాల శివ, సుకుమార్ బన్నీ, లైగర్, జనగణమన, హరిహర వీరమల్లు, రాజమౌళి మహేష్ ఇలా ఎన్నో భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

Telugu Salaar, Harihara, Budget, Janaganamana, Liger, Mahesh Babu, Ntr Koratala,

అటు నిర్మాతలు ఖర్చు పెట్టేందుకు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.ఎవరు దర్శకత్వం వహించిన ఎంత ఖర్చు పెట్టిన తుది తీర్పు ఇచ్చేది మాత్రం ప్రేక్షకులే.ఇక ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయకపోతే ఏం జరుగుతుందో రాధేశ్యామ్, కిలాడి హిందీలో బచ్చన్ పాండే సినిమాలనుచూస్తేనే అర్థమైపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube