చిక్కుడులో పొడి వేరు కుళ్ళు నియంత్రణకు యాజమాన్య పద్ధతులు..!

చిక్కుడుకు( Beans ) సోకే పొడి వేరు కుళ్ళు పుస్సరియం సొలని అనే శిలీంద్రం వల్ల కలుగుతుంది.ఈ శిలీంద్రాలు పంట అవశేషాలలో అనేక సంవత్సరాలుగా జీవించే ఉంటాయి.

 How To Prevent Dry Rot In Beans Details, Beans, Dry Rot, Beans Cultivation, Pest-TeluguStop.com

ఈ శిలీంద్రాలు విత్తనాలలోకి నీరు మరియు పోషకాలు వెళ్లే కణజాలాలపై తిష్ట వేస్తాయి.ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం, మొక్కలు చిన్నగా మరియు తెగులు సోకిన కొద్దీ సమయానికే ఎండిపోయి( Dry ) చనిపోవడం, ఈ తెగులు సోకిన ఒక వారంలోపే భూమిలో వేర్లపై ఎరుపు మచ్చలు రావడం, ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారి గుంపులుగా చేరి వీర్లపై పగుళ్లు ఏర్పరచడం లాంటివి జరిగి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

Telugu Agriculture, Beans, Beans Crop, Beanscrop, Beans Dry Rot, Certified Seeds

మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు( Seeds ) అందుబాటులో ఉన్నాయి.తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.నేలలో వేడి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఆలస్యంగా మొక్కలు నాటడం మంచిది.మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి వివిధ రకాల తెగుళ్లు సోకే అవకాశం ఉండదు.

ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా పని చేయాలి.క్రమం తప్పకుండా నీటి తడులు అందించాలి.తెగులు సోకిన పంటలోని గడ్డిని పశువులకు ఆహారంగా వేయకూడదు.

Telugu Agriculture, Beans, Beans Crop, Beanscrop, Beans Dry Rot, Certified Seeds

వేసవికాలంలో( Summer ) లోతు దుక్కులు దున్నుకోవాలి.అనంతరం పంట పొలంలో ఉండే పంట అవశేషాలను పూర్తిగా పరిశుభ్రం చేయాలి.పొలం గట్ల పైన కూడా ఎలాంటి కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రం చేసుకోవాలి.

వీలైనంతవరకు సేంద్రీయ ఎరువులకే( Organic Fertilizers ) అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.నీటి సౌకర్యం పుష్కలంగా ఉంటే పచ్చిరొట్ట పైర్లు వేయడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చు.

సేంద్రీయ పద్ధతిలో ఈ బాసిల్లస్ సుబ్టిలిన్, రైజోబియం ట్రోపిపి తో కలిపిన బయోకంట్రోల్ ఏజెంట్ విత్తన శుద్ధికి ఉపయోగించడం మంచిది.సూక్ష్మజీవులైన ట్రైకోడెర్మా హార్జియానుమ్ ను ఉపయోగించి ఈ శిలీంద్రాని నియంత్రించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube