ఇంట్లో అందరూ తిన్నాక ఎంతో కొంత అన్నం మిగిలి పోవడం సర్వ సాధారణం.అలా మిగిలిన అన్నాన్ని కొందరు రాత్రికి తింటారు.
రాత్రికి మిగిలితే తర్వాతి రోజు తింటారు.అలాగే మరి కొందరు మిగిలిన అన్నంతో క్రియేటివ్‌గా రకరకాల వంటకాలు చేస్తుంటారు.
కానీ, కొంత మంది మాత్రం మిగిలిన రైస్‌ను డస్ట్ బిన్‌లోకి తోసేస్తుంటారు.కానీ, ఇకపై అలా చేయకండి.
ఎందుకంటే, మిగిలిపోయిన అన్నంతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.ముఖ్యంగా ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో పొందడానికి అన్నం అద్భుతంగా సహాయ పడుతుంది.
మరి ఇంతకీ చర్మానికి అన్నంను ఎలా ఉపయోగించాలో లేట్ చేయ కుండా కిందకు ఓ లుక్కేసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు స్పూన్లు వైట్ రైస్, రెండు స్పూన్లు రోజ్ వాటర్, చిటికెడు కస్తూరి పసుపు, ఒక స్పూన్ నిమ్మ రసం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్‌సీడ్ జెల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని.
పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం అర నిమ్మ చెక్కను తీసుకుని చర్మంపై స్మూత్‌గా రబ్ చేసుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకు పోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు మరియు అదనపు జిడ్డు తొలగిపోయి.ముఖం ఫ్రెస్‌గా, గ్లోగా మెరుస్తుంది.
ఏదైనా పార్టీకి లేదా ఫంక్షన్‌కి సడెన్‌గా వెళ్లాల్సి వచ్చినప్పుడు.చాలా మంది బ్యూటీ పార్లర్‌కి పరుగులు పెడుతుంటారు.
కానీ, పైన చెప్పిన విధంగా రైస్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండానే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.