టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ మొదట్లో యాంకర్ గా కూడా చేసింది.ఇక ఈ మధ్య ఈమె తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటుంది.
పైగా గ్లామర్ లుక్ ను కూడా పరిచయం చేసింది సురేఖవాణి.సినీ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఒక నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది.
కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారడంతో ఏకంగా అభిమానులనే సంపాదించుకుంది.గత కొన్ని రోజుల నుండి సురేఖవాణికి సోషల్ మీడియా బాగా అలవాటు పడింది.
తన భర్త చనిపోయిన తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి.సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంది.
తన భర్త చనిపోవడంతో కొన్ని పుకార్లు కూడా ఎదుర్కొంది.వాటికి తన స్టైల్లో గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది.ఇదిలా ఉంటే తాను ఇప్పుడు ఇలా మారడానికి కారణం తన కూతురు సుప్రీత అనే చెప్పాలి.తన ఎత్తు కూతురైన సుప్రీత కూడా తన తల్లి ఎదుర్కొన్న పుకార్లకు గట్టి సమాధానం ఇచ్చి అందరి నోళ్ళు మూయించింది.
దీంతో అప్పటి నుంచి ఈ ఇద్దరు తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో బాగా పిచ్చెక్కిస్తున్నారు.
లేటు వయసులో కూడా సురేఖవాణి యంగ్ హీరోయిన్ లా కనిపిస్తుంది.ఈ మధ్య మొత్తం మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ బాగా ట్రెండ్ ను ఫాలో అవుతుంది.నిజానికి తను తన కూతురు సుప్రీత ఒక దగ్గర ఉంటే మాత్రం ఇద్దరు అక్కచెల్లెళ్ల లాగా కనిపిస్తారు.
సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన కూతురుతో కలిసి సురేఖవాణి బాగా పార్టీలు, ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.
తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురే తనకు ప్రపంచంగా మారడంతో అన్ని తన కూతురు తోనే షేర్ చేసుకుంటుంది.సుప్రీత కూడా తన తల్లితో ఫ్రెండ్ లాగా ఉంటుంది.ఇక వీరిద్దరూ కలిసి డాన్సులు చేస్తూ అందర్నీ ఫిదా చేస్తున్నారు.వీళ్లు చేసే స్టెప్పులు మాత్రం కుర్రాళ్ల మతిపోగెట్టేలా ఉంటాయి.సుప్రీత కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీతకు తన తల్లి ద్వారానే గుర్తింపు అందుకుంది.సోషల్ మీడియాలో ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు బూతులతో బాగా రెచ్చిపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా సుప్రీత తన సోషల్ మీడియా వేదికగా మరో వీడియో షేర్ చేసుకుంది.
అందులో తన తల్లితో కలిసి తను కూడా జీన్స్ వేసుకొని ఓ మ్యూజిక్ కు తెగ స్టెప్పులు వేసింది.ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో తల్లి కూతుర్లు ఎంత పద్దతిగా ఉన్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి ఈ కామెంట్లకు సుప్రీత ఎలా స్పందిస్తుందో చూడాలి.