క్రిస్మస్, నూతన సంవత్సరం వేళలో సిమ్లాకు ఎంతమంది తరలి వచ్చారంటే...

నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని, పర్వతాల రాణిగా పిలుచుకునే సిమ్లాను సందర్శించడానికి స్వదేశీ, విదేశీ పర్యాటకులు తరలివచ్చారు.ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో సిమ్లాకు చేరుకున్నారు.గడచిన ఎనిమిది రోజుల్లో సుమారు 6.50 లక్షల మంది పర్యాటకులు సిమ్లాను సందర్శించారు.ఇంతేకాదు డిసెంబర్ 24, డిసెంబర్ 31 మధ్య 1.9 లక్షల వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి.టూరిస్టులు ఇంత పెద్దఎత్తున రావడంతో సిమ్లాలోని హోటళ్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి.క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో టూరిస్టులు ఇక్కడి హోటళ్లు, రెస్టారెంట్‌లలో రూమ్‌లను బుక్ చేశారు.

 How Many People Flock To Shimla During Christmas And New Year ,shimla ,christmas-TeluguStop.com

కొనసాగుతున్న పర్యాటకుల రద్దీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు పర్యాటకులు సిమ్లాకు తరలిరావడంతో టూరిజం వ్యాపారుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. టూరిజం సీజన్ పీక్‌ స్టేజ్‌లో ఉన్నందున పర్యాటక వ్యాపారవేత్తల పని, ఆదాయం కూడా మూడు రెట్లు పెరిగింది.ఇప్పటికీ నగరంలో 60 శాతానికి పైగా హోటళ్లు బుక్ అయ్యేవున్నాయి.2023 సంవత్సరం ప్రారంభం పర్యాటక వ్యాపారవేత్తలకు కలసివచ్చే అవకాశంగా మారింది.సిమ్లాతో పాటు కులు, మనాలి, ధర్మశాల, చంబాలలో కూడా పర్యాటకుల తాకిడి మరింతగా పెరిగింది.డిసెంబర్ 31న 12,548 వాహనాలు సిమ్లాకు వచ్చాయి.2023 సంవత్సరం మొదటి రోజున, ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు 7,059 వాహనాలు సిమ్లాలోకి వచ్చాయి.నగరం నుంచి 13,587 వాహనాలు బయటకు వెళ్లాయి.

అదేవిధంగా డిసెంబర్ 30న 12,974 వాహనాలు, డిసెంబర్ 31 మధ్యాహ్నం 12,548 వాహనాలు సిమ్లాలోకి వచ్చాయి.

Telugu Christmas, Shimla, Hotels-Latest News - Telugu

ఈసారి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు సిమ్లా చేరుకోవడంతో పూర్తి సందడి వాతావరణం నెలకొంది.ఇదిలా ఉంటే వాహనాల ఒత్తిడి పెరగడంతో సిమ్లాలో ట్రాఫిక్ జామ్ సమస్య మరింతగా పెరిగింది.ప్రజల సౌకర్యార్థం సిమ్లా పోలీసు సిబ్బంది ఎంతగానో శ్రమించారు.

శక్తిపీఠాలలో కూడా పర్యాటకుల తాకిడి విపరీతంగా కనిపించింది.దేవభూమి హిమాచల్ ప్రదేశ్ వచ్చిన ప్రజలు శక్తిపీఠాలకు తల వంచి కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రధాన శక్తిపీఠాలను, దేవాలయాలను దాదాపు 1.40 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. కాంగ్రాలోని మూడు శక్తిపీఠాల్లో 48 వేల మంది, నైనా దేవి సన్నిధికి 50 వేల మంది భక్తుల తరలివచ్చారు.అలాగే ఇతర దేవాలయాకూ భక్తులు పోటెత్తారు.

నూతనం సంవత్సరం తమకు బాగుండాలని ఆకాంక్షించారు.హిమాచల్ ప్రదేశ్ జీడీపీలో పర్యాటక పరిశ్రమ అత్యధిక సహకారం అందిస్తోంది.మొత్తం జిడిపిలో దీని సహకారం 4.3 శాతంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube