నిప్పుల కుంపటిలా మారనున్న భానుడు

ఈ సంవత్సరం భానుడి భగభగలు అధిక స్థాయిలో ఉంటాయని ఎల్ ని నో ప్రభావం కూడా తోడవడం తో వర్షపాతం కూడా తక్కువ గా నమోదు కావచ్చని వ విపత్తుల నిర్వహణ విభాగం ఎండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

 High Temparature May Foregin Heat ,high Temparature , Md Dr. Br Ambedkar ,effect-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతల సరళిని గమనిస్తే 45 నుంచి 49 వరకు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అని మార్చి ఏప్రిల్ మే నెలలో మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటాయని వడగాల్పుల ప్రభావం కూడా ఈ సంవత్సరం అధికంగా ఉంటాయని ఆయన తెలిపారు .

తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈ వేసవికి రాష్ట్రం అగ్నిగుండంగా మారనున్నట్లు తెలుస్తుంది.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంటుంది ఫిబ్రవరిలోనే ఆ ప్రభావం మనకు తెలుస్తుంది పగటి పూట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అధికంగా నమోదు అవుతున్నాయి అందువల్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కూలి పనులకు వెళ్లేవాళ్లు తమ పనులను ఉదయం పూట పూర్తి చేసుకునే విధంగా చూసుకోవాలి.పిల్లలు వృద్ధులు తొందరగా ఎండ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారు మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండాలి.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.అవసరమైతే తప్ప బయటకు రాకూడదు డిహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరినీళ్లు మజ్జిగ పళ్ళ రసాలు సేవించాలి మంచినీళ్లను అధిక మోతాదులో తీసుకుంటూ ఉండాలి తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయలు, కర్పూజ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఘనాహారం కంటే ద్రవ ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి జిల్లా యంత్రాంగానికి వడగల్పులపై నాలుగు రోజులు ముందే సూచనలు చేస్తామని అయినప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube