వారసుడు కొత్త సంవత్సరంలోనే సందడి మొదలు పెట్టనున్నాడా?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణం లో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందుతున్న వారసుడు సినిమా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లకు పోటీగా విజయ్ తన వారసుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

 Hero Vijay Varasudu Movie Promotion Events In Telugu States , Dil Raju, Sankran-TeluguStop.com

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు మెల్ల మెల్ల గా సాగుతున్నాయి.అయితే వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నాయి.

కనుక వారసుడు సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు స్పీడ్ పెంచక పోతే కచ్చితంగా ఆ రెండు సినిమాల ముందు వారసుడు తేలిపోయే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనుక దిల్ రాజు టీం వచ్చే ఏడాది ఆరంభం లో అంటే జనవరి మొదటి వారం లో వారసుడు సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట.ప్రస్తుతానికి తమిళనాట వారసుడు సినిమా యొక్క పబ్లిసిటీ జరుగుతుంది.ఒకే సారి అక్కడ ఇక్కడ భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు.

కనుక మొదట ఒక చోట ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ఉద్దేశంతోనే చిత్ర యూనిట్ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అంటూ సమాచారం అందుతుంది.అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.

వారసుడు సినిమా లో విజయ్ కి జోడీగా మన శ్రీవల్లి రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube