ఈడీ ప్రశ్నల వర్షం. ఈడీ ఎదుట హీరో రానా.
కెల్విన్ ల్యాప్ టాప్ లో ఆధారాలు.? ఎఫ్-క్లబ్ కు రిలాక్స్ కోసం వెళ్లానని సమాధానం. డ్రగ్స్ సరఫరాలు జరిగిన ప్రేమ నిబంధనల ఉల్లంఘన పై విచారణ జరుపుతున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సినీ హీరో దగ్గుబాటి రానా, డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ మాస్కెరాన్స్ ను విచారించారు.కెల్విన్ ను మంగళవారం కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే ఎఫ్-క్లబ్ లో జరిగిన పార్టీలకు రానా హాజరవడం ఆ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశానని విచారణలో ఒప్పుకోవడంతో డబ్బులు బదిలీ అయ్యాయనే అనుమానాల నివృత్తి కోసం అధికారులు మరోసారి కెల్విన్ ను బుధవారం విచారించారు.
ఈడీ కోరిన విధంగా 2015 నుంచి 2017 మధ్యలో జరిగిన బ్యాంకు లావాదేవీల స్టేట్ మెంట్ రానా అధికారులకు అందించగా స్టేట్ మెంట్ లోని లావాదేవీల ప్రకారం అధికారులు రానాను ప్రశ్నించారు.ముందుగా కెల్విన్, రానాలను వేర్వేరు గదుల్లో ఉంచి ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత ఇద్దరిని కలిపి ప్రశ్నించారు.
కెల్విన్ లాప్ టాప్ లోని కొన్ని ఆర్థిక లావాదేవీలకు రానా బ్యాంక్ ఖాతాలో నుంచి బదిలీ అయిన మొత్తలకు సరిపోవడంతో వీటిపైనే అధికారులు ఎక్కువగా ప్రశ్నించారు.ఎఫ్-క్లబ్ లో జరిగే పార్టీలకు వెళ్లినప్పటికీ డ్రగ్స్ తీసుకోలేదని డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రానా చెప్పినట్లు తెలిసింది.
అయితే అయితే ఖాతాలో నుంచి జరిగిన డబ్బులు బదలాయింపు కెల్విన్ ఖాతాలోని చేరిన డబ్బులుపై ఆరా తీసిన ఇప్పుడు మాత్రం రానా మౌనంగా ఉన్నట్లు తెలిసింది.కెల్విన్ ఎప్పుడో కలిసినట్టు గుర్తుందన్న రానా.
ఎక్కడ కలిసింది ఎప్పుడు కలిసింది మాత్రం అంతగా గుర్తుకు రాలేదని చెప్పడం అంటున్నారు.కెల్విన్ లాప్ టాప్ లో ఉన్న సమాచారం లోని కొన్ని అంశాలను ముందుగానే ఎంపిక చేసుకున్న అధికారులు రానా నుంచి రాబట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిసింది సినిమా రంగంలో ఉన్న తనకు ఎంతోమందితో పరరిచాయలు ఉంటాయని.
ఎంతో మందితో ఆర్ధిక లావాదేవీలను కూడా జరపాల్సి ఉంటుందని అయితే పరిస్థితులు అందరూ మంచోళ్ళు అనుకుంటాం కానీ ఎవరు ఏం చేస్తున్నారో అనేది గుర్తించడం సాధ్యం కాదని అలాగే కెల్విన్ విషయంలోనూ జరిగి ఉంటుందని రానా చెప్పినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా కెల్విన్ ను ప్రశ్నించగా రానాతో సన్నిహిత పరిచయం ఉందని, ఆయన తనకు పలు పర్యాయాలు డబ్బులు బదలాయించారని, కొన్ని సందర్భాల్లో నగదు రూపంలోనూ చెల్లించారని చెప్పినట్లు తెలిసింది.

రానా ద్వారా సినీరంగంలోకి మరికొంతమంది పరిచయం అయ్యారని ఎఫ్-క్లబ్ లో పార్టీలన్నిటికీ క్రమం తప్పకుండా రానా హాజరయ్యారని చెప్పినట్లు తెలిసింది.అయితే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలోనూ కెల్విన్ నుంచి స్పష్టమైన సమాధానాన్ని అధికారులు రాబట్టలేకపోయింది.ఎఫ్-క్లబ్ లో జరిగిన పార్టీకి మూడు రోజుల ముందుగానే తనకు డ్రగ్స్ ఆర్డర్ వచ్చేదని ఈ ఆర్డర్ ను ఎఫ్-క్లబ్ మేనేజర్ ఇచ్చేవారని ఆర్డర్ ను బట్టి అవసరమైతే గోవా నుంచి డ్రగ్స్ తెప్పంచేవాడినని కూడా ఈడీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.బుధవారం విచారణ ముగిసినప్పటికీ మరోసారి పిలిపించి అవకాశాలు ఉన్నాయని ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది.