ఆసుపత్రిలో తలైవా రజినీకాంత్..!

రజనీకాంత్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు.అంతలా రజనీకాంత్ అభిమానుల మనసుని దోచుకున్నాడు.

 Annatthe Shooting, Apollo Hospitals, Blood Pressure, Breaking: Rajinikanth Hospi-TeluguStop.com

అయితే ఇప్పుడు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు .ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అధిక రక్తపోటుతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.అయితే తాజాగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

అందులో సూపర్ స్టార్ కి ఎలాంటి కరోనా లక్షణాలులేవని, ఒక్క హైబీపీతో మాత్రమే బాధపడుతున్నట్లు తెలిపారు.

గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఆయన ఉన్నారు.

అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు.కానీ, కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పాల్గినే వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఆ విషయం తెలిసిన తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌ కు వెళ్లారు.తర్వాత మళ్ళీ డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది.

అప్పుడు ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఉపిరి పీల్చుకున్నారు.

Telugu Annatthe, Pressure, Covid, Hyderabad, Rajinikanth-Latest News - Telugu

కానీ శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రజినీకాంత్ గారి బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ లో ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇదివరకే తాజాగా ఆయన కొత్త పార్టీ గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ సమయంలో ఇలా జరగడంతో తమిళనాడు అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఏది ఏమైనా రజినీకాంత్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube