ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ సమస్యతో బాధపడుతుంటారు.
ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు.రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అంతేకాకుండా షుగర్ వ్యాధి కొందరికి వారసత్వంగా కూడా సంక్రమిస్తుంది.
ఈ వ్యాధితో బాధపడే వారు వారి ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
ఇలాంటివారు తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.కేవలం ఆహార విషయంలోనే కాకుండా కొన్ని రకాల పండ్లను తినడం ద్వారా కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయని అపోహపడుతుంటారు.
కానీ ఈ పండ్లను తినడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జామ పండు: ఇందులో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.మధుమేహంతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.
నేరేడు పండు తినటం వల్ల రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి.అంజీర పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు తోడ్పడుతుంది.
చెర్రీ పండ్లలో ఉండే అంతోసియానిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని 50 శాతం పెంచడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే ఫ్లేతోరా న్యూట్రియన్స్ మధుమేహాన్ని నివారించడంతో పాటు, మధుమేహంతో ఏర్పడే గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.
బెర్రీస్ వీటిలో విటమిన్స్, ఫైబర్స్ అధిక మోతాదులో ఉండటంవల్ల రక్తంలోని చక్కెరను క్రమబద్ధీకరిస్తుంది.అంతేకాకుండా ఆపిల్, దానిమ్మ పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటమే కాకుండా షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రతిరోజు సరైన ఆహార నియమాలను పాటిస్తూ, తాజా పండ్లను తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.