ఆన్లైన్ లో భారతీయులను రక్షించడానికి గూగుల్ అనుసరించే మార్గాలివే

ఈ మధ్య ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయాయి.గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, మోబ్ క్విక్ లాంటి అనేక యాప్ లు పుట్టుకొచ్చాయి.

 Here Are The Steps Taken By Google To Protect Indians Online, Online, Shopping,-TeluguStop.com

డజన్ల కొద్ది యూపీఐ యాప్స్ పుట్టుకొచ్చాయి.దీంతో రోజురోజుకి దేశంలో యూపీఏ పేమెంట్స్ అత్యధిక శాతం పెరుగుతున్నాయి.

రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి.అయితే యూపీఐ పేమెంట్స్ వల్ల ఆన్ లైన్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఇండియా ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది.

ఆన్ లైన్ స్కామ్ ల నుంచి భారతీయులను రక్షించడానికి 5 మార్గాలను అనుసరించినట్లు గురువారం జరిగిన సేఫర్ విత్ గూగుల్ ఇండియా ఈవెంట్ లో గూగుల్ సంస్థ తెలిపింది.ఆన్ లైన్, సైబర్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నిపుణులను నియమించికుని సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా టూల్స్ డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా లక్ష మంది డెవలపర్లతో సైబర్ సెక్యూరిటీ అప్ స్కిల్లింగ్ ప్రొగ్రామ్ లను కంపెనీ ప్రారంబించింది.

ఇక సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు స్కామర్ల అకౌంట్లను గూగుల్ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తుంది.

వ్యక్తులు తమ పేమెంట్ కోడ్ లను స్కామర్లతో పంచుకోవడం పెద్ద ప్రమాదానిక దారి తీస్తుందని గూగుల్ చెబుతోంది.పేమెంట్ కోడ్ లను తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని, బ్యాంకులోని డబ్బులను కొల్లగొట్టే ప్రమాదముందని తెలిపింది.

దాదాపు 2 లక్షల మంది యూజర్లను సేఫ్టీ అలర్ట్ తో రక్షిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.ఇక దీని కోసం ProtectingChildren.

Google అనే వెబ్ సైట్ ను గూగుల్ ప్రారంభించింది.హఇందీ, తమిళం, బెంగాలీ వంటి భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది.

రానున్న రోజుల్లో మరిన్ని భాసల్లో ఈ వెబ్ సైట్ ను తీసుకురానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube