ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్ముకశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్ నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనంలో వాదనలు ముగిశాయి.
దాదాపు 16 రోజుల విచారణ అనంతరం సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.కాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ ను విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అత్యంత సున్నితమైన మరియు సమస్యాత్మక అంశం కావడం వలన విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.