పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఎదురుగాలి..!!

బెంగాల్ లో మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో దాదాపు 18 స్థానాలు గెలుచుకుని 40 శాతం ఓటు బ్యాంకు రాబట్టుకుంది కమలం పార్టీ.దీంతో కచ్చితంగా కష్టపడితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం గ్యారెంటీ అని బీజేపీ పార్టీ పెద్దలు భారీగానే ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టడం జరిగింది.

 Headwind For Bjp In West Bengal, West Bengal, Bjp, Mamatha Banerjee, Abp-c Voter-TeluguStop.com

ఈ పరిణామంతో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీకి బిజెపి పార్టీ నాయకుల మధ్య నువ్వానేనా అన్నట్టుగా చాలాసార్లు పరిస్థితులు మారడం జరిగింది.

ఇదిలా ఉంటే త్వరలో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో అక్కడ జరుగుతున్న సర్వేలు ఇప్పుడు బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి.

తాజాగా ఏబీపీ-సి- ఓటర్ సంస్థ చేసిన సర్వేలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 95- 105 స్థానాలు వస్తాయని, మమతా బెనర్జీ పార్టీకి 145 నుండి 150 సీట్లు రావటం గ్యారెంటీ అని ఆమె మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సర్వే తెలిపింది.దీంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కమలనాథులకి తాజా సర్వే ఫలితాలు షాక్ ఇచ్చినట్లు అయింది.

కాదా ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో అప్పటికి లెక్కలు మారే అవకాశం ఉన్నాయి అనే ఆలోచనలో బెంగాల్ బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube