క్రికెటర్ పెళ్లంటే మజాకా.. లగ్నపత్రికతోనే దిమ్మతిరిగేలా చేస్తున్నాడు, ఇక పెళ్లి ఎలా ఉంటుందో?

ఇపుడు పెళ్లిళ్ల విషయంలో ఎవరూ తగ్గట్లేదు.సగటు పేదవాడే పెళ్ళిళ్ళను ఘనంగా చేసినపుడు, బడాబాబులు ఇంకెంత రేంజులో చేస్తారు.

 He Is Overwhelmed With The Marriage Certificate, How Can The Marriage Be , Indian Cricket, Marriage, Teamindia Pacer Deepak Chahar, Jaya Bhardwaj, Ipl, Girlfriend Jaya Bhardwaj-TeluguStop.com

అలాగే సెలిబ్రిటీలు అనబడిన సినిమా వాళ్ళు, క్రికెట్ క్రీడాకారుల ఇళ్లల్లో సంబరాలు ఏ విధంగా జరుగుతాయో మనం ఊహించుకోవచ్చు.అందులోనూ క్రికెటర్లకు వున్న క్రేజే వేరు.

క్రికెట్ ను ఒక మతంగా భావించే భారత్లో అయితే క్రికెటర్లకు కాస్త బోర్డర్ దాటి పాపులారిటీ ఉంటుంది.ఇక ఎవరైనా ఆటగాళ్లకు సంబంధించి ఏదైనా పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించిందంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోవడం సహజంగా జరిగిపోతుంది.

 He Is Overwhelmed With The Marriage Certificate, How Can The Marriage Be , Indian Cricket, Marriage, TeamIndia Pacer Deepak Chahar, Jaya Bhardwaj, IPL, Girlfriend Jaya Bhardwaj-క్రికెటర్ పెళ్లంటే మజాకా.. లగ్నపత్రికతోనే దిమ్మతిరిగేలా చేస్తున్నాడు, ఇక పెళ్లి ఎలా ఉంటుందో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే క్రికెటర్లకు సంబంధించి పర్సనల్ విషయం ఏదీ బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా టీమిండియా ఫేసర్ దీపక్ చాహర్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.

దీపక్ చాహర్ ‘జయ‘ అనే అమ్మాయి ప్రేమలో వున్న సంగతి తెలిసిందే.ఎన్నో రోజుల నుంచి తన ప్రేమను అఫీషియల్ గానే సోషల్ మీడియాలో బయటపెడుతూ వచ్చారు.అయితే ఎట్టకేలకు జయ భరద్వాజ్ ను దీపక్ చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు.అవును… జూన్ 1వ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది.IPL సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మ్యాచ్ ఆడిన దీపక్ ఇక తన ప్రేయసి జయ భరద్వాజ్ కు ప్రపోజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక జయ భరద్వాజ్ విషయానికొస్తే, ఢిల్లీకి చెందిన ఈమె ఓ కార్పొరేట్ సంస్థలో పని చేస్తూ ఉంటుంది.తొలిచూపులోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు.కులాంతర వివాహం అయినప్పటికీ వీరు పెద్దలను ఒప్పించి మరీ వివాహానికి సిద్ధమయ్యారు.

కాగా వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.అయితే మెగా వేలంలో దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో నమ్మకంతో 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

గాయం కారణంగా స్టార్ ఆటగాడు సీజన్ మొత్తానికి దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube