మరోసారి నెటిజెన్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హరీష్ శంకర్.. స్టుపిడ్స్ అంటూ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకరు.ఈయన సోషల్ మీడియాలో వస్తున్నా ట్రోల్స్ పై ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ నెటిజెన్స్ కు కౌంటర్ ఇస్తుంటాడు.

 Harish Shankar's Strong Reply To A Negative Tweet, Bhavadeeyudu Bhagat Singh, C-TeluguStop.com

దీంతో హరీష్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తాడు.ఈయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.

తాజాగా మరోసారి ఈ డైరెక్టర్ ఒక నెటిజెన్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇవ్వడం నెట్టింట వైరల్ అవుతుంది.

ఇటీవలే హరీష్ శంకర్ కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు.

వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.ఈయన షేర్ చేసిన వీడియోపై ఒక నెటిజెన్ స్పందించాడు.

హరీష్ శంకర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని.తీవ్ర ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కామెంట్ పై హరీష్ శంకర్ స్పందిస్తూ ఏదైనా మంచి జరుగుతుందని నిపుణుడు చెప్పినప్పుడు కూడా కొంతంది ఆశలు పెట్టుకోరు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.హరీష్ శంకర్ ”మీలాంటి మూర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నందుకు సంతోషిస్తున్నారు” ఎందుకంటే మీలాంటి వారు ఎప్పుడు ఒక నిపుణుడు ఏదైనా మంచిది అని చెప్పినప్పుడు.అతడు పదేపదే జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కి చెప్పినప్పుడు కూడా ప్రజలకు ఆశలు కల్పించాలని కోరుకోరు.అంటూ ఘాటుగా స్పందించారు.

హరీష్ శంకర్ సినిమా విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ప్రకటించాడు.భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ప్రకటించాడు.ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉంది.పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.దీంతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ గా ఉంది.ఈ రెండు విడుదల అయినా తర్వాతనే హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ అవ్వనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube