సాధారణంగా తండ్రులకు తమ కూతుర్లపై ఎంతో ప్రేమ ఉంటుంది.వారి సంతోషం కోసం ఏం చేయడానికైనా తండ్రులు సిద్ధమవుతారు.
కష్టమైనా, భారమైనా కూతుర్ల సంతోషమే తమకు ముఖ్యమని వారు భావిస్తారు.ఇక కూతుర్లకు కూడా తండ్రులంటేనే ఎక్కువ ఇష్టం.
ఇలాంటి స్వీట్ రిలేషన్‌షిప్‌ని వీరిద్దరూ పంచుకుంటుంటారు.అయితే అలాంటి రిలేషన్‌షిప్‌కి అద్దం పట్టే ఒక ఘటన చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా( Social Media )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఆ వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనకు స్కూల్ ఫంక్షన్‌లో కూతురితో కలిసి తండ్రి డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది.నిజానికి ఈ తండ్రికి కాళ్లు పనిచేయవు ఆయన ఒక దివ్యాంగుడు.అయినా సరే తన కూతురి సంతోషం కోసం వీల్‌ఛైర్‌లో కూర్చుని స్టేజ్ మీదకి వచ్చాడు.
ఆపై డ్యాన్స్ చేసి తన కుమార్తె ముఖంలో చిరునవ్వులు చిందించాడు.తన తండ్రి దివ్యంగుడైనా( Handicapped ) ఇతర తండ్రులకు ఏమాత్రం తీసిపోడని ఆ కుమార్తెకు ఇతను భరోసా ఇచ్చాడు.
ఈ వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.
వైరల్ కంటెంట్ షేర్ చేసే ప్రముఖ ట్విట్టర్ పేజీ ది ఫైజెన్ ( The Figen )దీనిని తాజాగా షేర్ చేసింది.23 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో తండ్రి వీల్ చైర్ పై కూర్చొని తన చిన్నారితో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు.ఈ దృశ్యం చూసేందుకు మనసును హత్తుకునేలా ఉంది.
అంతేకాకుండా పక్కనే ఇతర స్టూడెంట్స్ తమ నాన్నలతో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది.అయితే వారెలా డ్యాన్స్ చేస్తున్నారో అలానే ఈ తండ్రి కూడా తన కూతురితో డ్యాన్స్ చేయించాడు.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన సమయం నుంచి దాదాపు పది లక్షల వరకు వ్యూస్ సంపాదించింది.ఈ హార్ట్ టచింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.