ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurupatwant Singh Pannu ) హత్యకు కుట్ర జరిగిందంటూ అమెరికా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.భారత్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పన్నూ హత్యకు అమెరికాలో యత్నాలు జరిగాయని అగ్రరాజ్యం ఆరోపించింది.
అయితే దీనిపై అమెరికా ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది.భారత్ తన దర్యాప్తు వివరాలు ప్రకటించే వరకు వేచి వుండాలని వాషింగ్టన్ పేర్కొంది.
తాము ఈ సమస్యను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి భారత విదేశాంగ మంత్రితో నేరుగా ప్రస్తావించారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) తన రోజువారీ విలేకరుల సమావేశంలో అన్నారు.వారు (భారతదేశం) బహిరంగంగా విచారణ చేస్తామని ప్రకటించారని.
ఆ ఫలితాల కోసం తాము వేచి చూస్తామని మిల్లర్ పేర్కొన్నారు.అలాగే హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం వుందన్న ఆరోపణలపై కెనడా చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను తాము కోరినట్లు మిల్లర్ వెల్లడించారు.

కాగా.గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిని అమెరికా భగ్నం చేసినట్లుగా ఈ కథనం పేర్కొంది.అయితే పన్నూ హత్యకు కుట్రలో నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం వుందంటూ ఇటీవల అమెరికా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది.
యూఎస్ అధికారుల ప్రకారం.పన్నూను హత్య చేయడానికి ఒక హంతకుడుకి $100,000 చెల్లించడానికి నిఖిల్ అంగీకరించాడు.
ఈ ఏడాది జూన్ 9న $15,000 అడ్వాన్స్‌గా చెల్లించారు.

సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని గళమెత్తుతోన్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడి హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించింది.ఈ మేరకు భారత్ నుంచి నిందితుడికి ఆదేశాలు అందాయని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది.కానీ ఈ ప్రకటనలో మాత్రం పన్నూ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్ స్పందించింది.నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.
అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.