తరలివచ్చిన రంగా అభిమానులు కాకినాడ రూరల్… కాపు సద్భావన మరియు కాపునాడు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు జన్మదినం సందర్భంగా రమణయ్యపేట కాపుల రామాలయం వీధిలో తన నివాసం వద్ద అభిమానుల మధ్య కాపు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విచ్చేసి కేక్ కట్ చేసి వాసిరెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు .
వాసిరెడ్డి కుటుంబ సభ్యులు వంగవీటి రాధాకు మంగళ హారతులు ఇచ్చి గజమాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం కాపు సద్భావన సంఘం సభ్యులు రాధా, వాసిరెడ్డి ఇరువురికి గజమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వంగవీటి రాధాకృష్ణ కాపు రత్న బసవ ప్రభాకర్ రావు కు దు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి రంగా అభిమానులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు.