యూఎస్ విజిటర్ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త.. ఇప్పటినుంచి..

అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త.మొదటిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు అమెరికా శుభవార్త చెప్పింది.

 Good News For Us Visitor Visa Applicants.. From Now On.. , Us Visitor Visa, App-TeluguStop.com

వీసా కోసం ఎదురు చూడకుండా అదునపు చర్యలు తీసుకుంటుంది.కోవిడ్ 19 కారణంగా గత మూడు సంవత్సరాల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో వీసా ప్రాసెసింగ్ లో ఉన్న బ్యాక్లాగ్ సమస్యలను పరిష్కరించడానికి శనివారాల్లో ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.దాని వల్ల అదనపు స్లాట్లతో భారీగా అపాయింట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి.

Telugu Chennai, Hyderabad, International, Interview, Mumbai, Delhi, Embassy, Vis

దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే ఈ భారీ ప్రయత్నం లో భాగంగా జనవరి 21 వ తేదీన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్ కలకత్తాలోని కాన్సులేట్‌లు విజిటర్ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాయి.ఇందుకోసం చాలా మంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు.ఇంకా చెప్పాలంటే ఈ ప్రక్రియ సామర్ధ్యాన్ని పెంచడానికి జనవరి మరియు మార్చి 2023 మధ్య వాషింగ్టన్ ఇతర రాయబార కార్యాలయాల నుంచి చాలామంది తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి వస్తున్నారు.మరోవైపు ఎంబసి, కాన్సులేట్‌లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్య కూడా పెంచుతున్నారు.

Telugu Chennai, Hyderabad, International, Interview, Mumbai, Delhi, Embassy, Vis

రాబోయే రోజుల్లో ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్‌మెంట్‌ల కోసం అదనపు స్లాట్‌లను తేరుస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే ఇది వరకే మునుపటి అమెరికా వీసాలతో ఉన్న దరఖాస్తు దారుల కోసం ఇంటర్వ్యూలను మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది.అటువంటి దరఖాస్తుదారులు ఇప్పటి నుంచి వ్యక్తి గత ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం లేదు అని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube