హైదరాబాద్ కూకట్ పల్లిలో దొంగలు రెచ్చిపోయారు.ఒకే రోజు ఎనిమిది ఇళ్లల్లో దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు.
అందినకాడికి దోచుకుని ఊడాయించారు.వరుస చోరీలతో కూకట్ పల్లి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని కూకట్ పల్లి కాలనీ అసోసియేషన్ సూచించింది.మరోవైపు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.