తెలంగాణ, మంచిర్యాల జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు, మరియు మత్స్య ఔత్సాహికులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం కింద 2020-21 వ సంవత్సరానికి గాను ఋణాలు మంజూరు చేయడానికి ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అధికారులు.ఈ విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ నిన్న ఒక ప్రకటనలో తెలిపారట.
ఇకపోతే దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్రింది విధంగా ఋణాలు అందిస్తామని వెల్లడిస్తున్నారు.ఇక ఆ వివరాలు చూస్తే.రూ.25 లక్షల వరకు మంచినీటి చేపల హేచరీలకు.చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణానికి రూ.8.50 లక్షలు.మరియు రూ.25 లక్షలు రినర్మ్యూలేటర్ ఆక్వాకల్చరు సిస్టమ్ కు, జలాశయములలో పంజరములలో చేపల పెంపకం రూ.3 లక్షలు.ఇన్సులేటేడ్ వాహనముల సరఫరా రూ.20 లక్షలు.

మూడు చక్రముల వాహనముల సరఫరాకు రూ.3 లక్షలు, చిన్న తరహా చేప దాణా మిల్లుల ఏర్పాటుకు రూ.30 లక్షలు, మత్స్య విక్రయ కేంద్రముల ఏర్పాటుకు రూ.10 లక్షలు ఋణాల మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా మత్స్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ఈ పథకంలో మహిళలకు 40 శాతం సబ్సిడి అందిస్తుండగా, ఎస్సీ, ఎస్టీ లకు 60 శాతం సబ్సిడి మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.మత్స్యకారులు, ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాయం మంచిర్యాలలో ఈ నెల 23 వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని వారు కోరుతున్నారు.