వామ్మోఅన్నికోట్లా ? గోదావరి కోడి పందేల స్పెషల్ ఇదేగా ?

ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కోడి పందాల సందడి కనిపిస్తోంది.అసలు సంక్రాంతి అంటే కోడి పందేలు అన్నట్టుగా గోదావరి జిల్లాల్లో పందాలు ప్రతి ఏటా సాగుతుంటాయి.

 Godavari Sankranthi Special Update-TeluguStop.com

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పందాలు కాసేందుకు, చూసేందుకు ఈ జిల్లాలకు జనాలు వాలిపోతుంటారు.ఊరికి దూరంగా తోటల్లో పందెం బరులు ఏర్పాటు చేయడంతో భారీగా జనాలు హాజరవుతూ సందడి సందడి చేస్తున్నారు.

ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది.పందేల నిర్వహణకు అనధి,కారికంగా ఆదేశాలు ఉండడంతో పోలీసులు సైలెంట్ అయిపోయారు.

ఈ కోడి ,పందాలు తిరునాళ్లను తలపించేలా జనాలతో కిక్కిరిసి పోతున్నాయి.పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కలగంపూడి ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి చోటా కోడిపందాలు, పేకాట, గుండాట యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.

Telugu Bhimavaram, Buttayigudem, Cock Ap, Janga Gudem, Koyalagudem, Polavaram, S

గోదావరి జిల్లాలోనే కాకుండా కోస్తాలోని అన్ని ప్రాంతాల్లోనూ కోడిపందాలు ప్రతి గ్రామంలోనూ భారీ ఎత్తున నిర్వహించారు.అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది.ఇక్కడ పందేలను చూసేందుకు ఎక్కడ ఎక్కడి నుంచో జనాలు ఇక్కడికి వాలిపోతుంటారు.అందుకే గోదావరి జిల్లాలో పండుగ మూడు రోజులు సుమారు 300 , 400 కోట్ల రూపాయల మేర చేతులు మారినట్టు సమాచారం.

వీటికి రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉండడంతో భారీ ఏర్పాట్ల మధ్య వీటి నిర్వహణ సాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి ఎమ్యెల్యేలు, మంత్రులు వీటిని చూసేందుకు గోదావరి జిల్లాలలకు క్యూ కట్టారు.

Telugu Bhimavaram, Buttayigudem, Cock Ap, Janga Gudem, Koyalagudem, Polavaram, S

కోడి పందేలు జరిగే చోట గొడవలు కూడా అదే రేంజ్ లో చోటు చేసుకున్నాయి.పశ్చిమగోదావరి జిల్లాలో కుర్చీలు గాల్లో లేచాయి.పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.పేకాట లెక్కల్లో తేడా రావడంతో కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు.

ఇదే జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగిన కోడి పందేల్లో విషాదం చోటుచేసుకుంది.కోడి కత్తి మర్మాంగాలకు తగలటంతో వెంకటేష్ అనే వ్యక్తి చనిపోయాడు.

పందెంలో కోళ్లు కొట్టుకుంటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ పైకి కత్తి కట్టిన కోడి దూసుకొచ్చింది.కోడి కత్తి మర్మాంగాలను కట్ చేయడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube