దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది.ప్రియురాలు, ఆమె తమ్ముడుతో కలిసి మద్యం పార్టీ చేసుకుంటున్నాడు ప్రియుడు.
అయితే పార్టీలో ప్రియుడు రెచ్చిపోయి ప్రియురాలి తమ్ముడు ముందే ఆమెతో సరసాలు ఆడడం మొదలు పెట్టాడు.ప్రియుడి ప్రవర్తన ఆమె తమ్ముడికి కోపం తెప్పించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
చిన్న గొడవ పెద్దదిగా కావడంతో ప్రియురాలితో సహా, ఆమె తమ్ముడు, మరొకరు కలసి ప్రియుడిపై దాడికి దిగారు.ఈ దాడిలో వారు ప్రియుడిని దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పరారైయ్యారు.
ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఢిల్లీలోని వజీరాబాద్ ఏరియాకి చెందిన సాహిల్(23) వర్ష (24) ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు.అయితే సాహిల్ రాత్రివేళ ప్రియురాలి ఇంటికి వెళ్ళాడు.
అయితే అక్కడ ప్రియురాలి తమ్ముడు, అతని స్నేహితుడు అలీ, సాహిల్, వర్ష అంత కలిసి మందు పార్టీ చేసుకుంటున్నారు.అయితే మద్యం మత్తులో సాహిల్ ప్రియురాలితో హద్దులు మీరి ప్రవర్తించడంతో వర్ష అతనితో వాదించింది.
అయినా అతను ఆమె మాట వినిపించు కోకపోవడంతో ప్రియురాలి తమ్ముడు ఆకాష్ ఆగ్రహానికి గురైయ్యాడు.దీంతో వారి మధ్య గొడవ పెద్దది కావడంతో కోపంతో రగిలిపోయిన వారు సాహిల్ ను బెల్ట్ తో గొంతు బిగించి చంపేశారు.
మృతదేహాన్ని వజీరాబాద్ ప్రాంతంలో పడేసి నిందితులు ముగ్గురు అక్కడి నుండి యూపీకి పరారైయ్యారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సీసీ టీవీ ఆధారంగా నిందితులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు.