వినాయక నిమజ్జనం విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ట్యాంక్‌బండ్‌పై న్యూ రూల్స్

వినాయక చవితి సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి.గణపతి నవరాత్రులను దేశవ్యాప్లంతా ప్రతి చోటా వైభవంగా జరుపుతున్నారు.

 Ghmc's Key Decision In The Matter Of Vinayaka Immersion New Rules On Tank Bond-TeluguStop.com

ఎక్కడ చూసినా, వీధి వీధిలో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. డీజేలు, సౌండ్ బాక్స్‌లు పెట్టి హోరెత్తిస్తున్నారు.

వినాయక మండపాలను చక్కగా అలంకరిస్తున్నారు.కొందరు పండ్లతోనూ, ఇంకొందరు నోట్లతోనూ, నాణేలతోనూ ఇలా వైవిధ్యంగా వినాయకుని తయారు చేస్తున్నారు.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అని అనగానే ఖచ్చితంగా ఖైరతాబాద్ పేరు వినపడుతుంది.ఇక భాగ్యనగరంలో మూలమూలలా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు.

ఈ తరుణంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.ట్యాంక్‌బండ్‌పై క్రేన్స్‌ను ఉండనిచ్చేది లేదని స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఇక ఈ ఆదేశాల వల్ల ప్రస్తుతం ప్రతి చోటా మట్టి విగ్రహాలనే తయారు చేస్తున్నారు.అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు.

ఈ కారణంగా పరిమిత సంఖ్యలో ట్యాంక్ బండ్‌పై క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఈ ఆదేశాలు అధికారికంగా విడుదల చేయలేదు.అయినప్పటికీ అధికారుల నిర్ణయం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఆగ్రహం కలిగిస్తోంది.తాము అన్ని రకాల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తీసుకొస్తామని భీష్మిస్తున్నారు.మరో వైపు అధికారులు తమ నిర్ణయంపై పట్టువీడడం లేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయించేది లేదనే దిశగా సంకేతాలిస్తున్నారు.అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అధికారికంగా ఈ ఉత్తర్వులను విడుదల చేయడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube