తెలుగు ప్రేక్షకులకు నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ( gautham krishna )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గౌతమ్ కేవలం నటుడు మాత్రమే కాదు డాక్టర్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు వరకు గౌతమ్ ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు.కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
బిగ్బాస్ హౌస్లో మొదటి నుంచి ఆటలు గేమ్ ల విషయంలో ఎంతో తెలివిగా ఆడుతూ అందరి మన్నలను పొందుతూ పదవ వారం వరకు కొనసాగుతూ వచ్చాడు.ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదోవారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంటర్ ఇస్తున్నారు.ఇప్పటికే అర్జున్ భార్య శివాజీ కొడుకు అలాగే ప్రియాంక ప్రియుడు శివ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే ఆమె రావడానికి ముందు కొడుకు కోసం ఒక పంచెను పంపించారు.
ఆ తర్వాత కన్నయ్య అంటూ పిలిచారు.తన తల్లి గొంతు విని గుర్తుపట్టిన గౌతమ్ ఇల్లు మొత్తం తల్లి కోసం వెతికాడు.
అలా కొద్దిసేపటి తర్వాత ఆమె ఎంట్రీ ఇచ్చారు. తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆప్యాయంగా కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు.
తన కొడుకుకి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిందని చెబుతూ సంతోషపడ్డారు.
అనంతరం బిగ్ బాస్ హౌస్ లో ఆట తీరు గురించి మాట్లాడుతూ కొడుకుకు మంచి మంచి సలహాలను ఇచ్చింది.నువ్వు నీ మాట మీదనే ఉండు.కరెక్ట్ పాయింట్ మాట్లాడినప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గకు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము.
కప్పు గెలుస్తావని ఆశిస్తున్నాము అని తెలిపింది గౌతమ్ తల్లి.అనంతరం గౌతమ్ మదర్ కిచెన్ లోకి వెళ్లి మీరందరూ చాలా రోజులుగా అమ్మ గోరుముద్దులు మిస్ అవుతున్నారు కదా ఈరోజు మీ అందరికీ నేనే తినిపిస్తాను అంటూ కంటెస్టెంట్లు అందరికీ గోరుముద్దలు తినిపించింది.
దాంతో బోలే షావలి ప్రిన్స్ యావర్లు వారి తల్లిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత మదర్ సాంగ్ ప్లే చేయడంతో ఎవరు గుండెలు పగిలేలా ఏడ్చాడు.
అప్పుడు ప్రశాంత్ ఓదార్చగా గౌతమ్ తల్లి అక్కడికి రావడంతో నాకు అమ్మ లేదు అమ్మ అంటూ ఆమెను పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు యావర్( Prince Yawar ).అప్పుడు గౌతమ్ తల్లి నువ్వు నా కొడుకువే ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అంటూ దగ్గరికి తీసుకొని యావర్ ని ఓదార్చింది.అయితే కొడుకు గౌతమ్ తో పాటు అందరి పట్ల ఒకే విధమైన ప్రేమను కురిపించడంతో గౌతమ్ తల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు బిగ్ బాస్ ప్రేమికులు.