“వాల్తేరు వీరయ్య”( Waltheru Veeraya ) 200 రోజుల వేడుకల కార్యక్రమంలో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.హీరోల రెమ్యూనరేషన్ కంటే.
రాష్ట్ర సమస్యలు పేదలకు మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉంటే మంచిదని హితవు పలికారు.పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఫిలిం ఇండస్ట్రీపై పడతారేంటి అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.ఇదిలా ఉంటే చిరంజీవి( Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao )ట్విట్టర్ లో సమర్థిస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.” విమర్శలకు , వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోండి.రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.
చిరంజీవి గారు చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారు, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా.మీరు ప్రత్యేక హోదా గురించి…రోడ్ల నిర్మాణం గురించి…ప్రాజెక్టుల గురించి….పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి.అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి… ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు…ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదు…ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారు” అనీ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ లో చిరుని సమర్థిస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.