శ్రీనగర్లో మూడో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు శ్రీనగర్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
ప్రత్యేక హోదా రద్దు తరువాత జమ్మూకాశ్మీర్ లో తొలిసారి జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ఇదే.ఈ నేపథ్యంలో జీ20 ప్రతినిధులకు అధికారులు మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.కాగా ఐదు కీలక ప్రాధాన్యతా రంగాలపై జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశం దృష్టి సారించింది.ఈ సమావేశాల్లో జీ 20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.
మరోవైపు శ్రీనగర్ లో సమావేశం ఏర్పాటు బాధ్యతారహిత చర్య అని పాకిస్థాన్ ఆరోపిస్తుంది.