ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఈ క్రమంలోనే ఎఫ్ఎస్ఎల్ నివేదిక సిట్ చేతికి చేరింది.
ప్రలోభాల కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ లతో పాటు సింహయాజిలకు ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు నిర్వహించారు.ముగ్గురి స్వర నమూనాలను ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇదే కేసులో సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.ఎఫ్ఐఆర్ లో ఏ4గా బీఎల్.
సంతోష్, ఏ5 గా తుషార్, ఏ6 గా జగ్గుస్వామి, ఏ7 గా శ్రీనివాస్ ను చేరుస్తూ న్యాయస్థానంలో సిట్ మెమో దాఖలు చేసింది.