తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలలో పాల్గొంటూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే మాజీ మంత్రి జానారెడ్డి( Ex Minister Jana Reddy ) మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విషయంలోకి వెళ్తే నల్గొండ గుర్రంపోడు సమావేశం( Gurrampode Meeting )లో పాల్గొనడం జరిగింది.
అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ పదవుల రేసులో తాను ఎప్పుడు లేరని స్పష్టం చేశారు.పదవే రేసులో ఉండి నన్ను అందుకుంటుంది తప్ప.ఎప్పుడు కూడా నేను రేసులో లేను.ప్రజల హృదయాలలో నేను సీఎం కావాలని ఉంది.
నాకు నేనుగా ఏ పదవి కోరుకోవడం లేదు.ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో.హఠాత్తుగా ఏ పదవి వచ్చినా కాదనను.21 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నేను ఏ ముఖ్యమంత్రి చెయ్యనండి శాఖలకు మంత్రిగా చేశాను.నాకు 56 ఏళ్ల అనుభవం ఉందని జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.