పురుగుల మందు తాగి అటవీశాఖ అధికారిణి మృతి  

mahaboob nagar, forest officer, suicide - Telugu Forest Officer, Mahaboob Nagar, Suicide

పురుగుల మందు తాగి అటవీశాఖ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మహబూబ్ నగర్ కు చెందిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ మహిళా అధికారిణి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

TeluguStop.com - Forest Official Dies After Drinking Insecticide

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

TeluguStop.com - పురుగుల మందు తాగి అటవీశాఖ అధికారిణి మృతి-Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఖిల్లా ఘన్ పూర్ కు చెందిన వహీదాబేగం (32) మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ లోని అటవీశాఖ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు.ఈమె భర్త భానుప్రకాశ్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్.

వీరికి మూడేళ్ల కూతురు ఉంది.అయితే భానుప్రకాశ్, వహీదాబేగం డిగ్రీలో ప్రేమించి వివాహం చేసుకున్నారు.

ఈ మధ్యకాలంలో భానుప్రకాశ్ కు డిగ్రీ కళాశాలలో చదివే మరో స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది.అది కాస్త ప్రేమకు దారి తీసింది.దీంతో భాను ప్రకాశ్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని వహీదాబేగంకు చెప్పడంతో గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్నాయి.ఈ మేరకు బుధవారం రాత్రి కూడా గొడవ జరగడంతో మానసిక ఒత్తిడికి లోనైన వహీదా పురుగుల మందు తాగింది.

చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు.కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

#Forest Officer #Mahaboob Nagar #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Forest Official Dies After Drinking Insecticide Related Telugu News,Photos/Pics,Images..