ప్రస్తుతం సీయూఈటీ-యూజీ 2023 (CUET-UG 2023) టెస్ట్ అనేది విదేశీ, OCI, ఎన్నారై అభ్యర్థులకు భారతదేశంలో వారి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కొనసాగించడానికి అవకాశాలను అందిస్తుంది.విదేశీ అభ్యర్థులు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారై), ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) అభ్యర్థులు ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG) 2023 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్, ప్రొఫెసర్ M.జగదీష్ కుమార్ తాజాగా ప్రకటించారు.భారతదేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు యూజీ ప్రవేశాల కోసం CUETని మాత్రమే అంగీకరిస్తాయి.
CUET-UG 2023 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో, అభ్యర్థులు భారతీయ, OCI, NRI లేదా విదేశీని కలిగి ఉన్న డ్రాప్‌డౌన్ మెనూ నుండి వారి జాతీయతను ఎంచుకోవాలి.CUET-UG 2023 టెస్ట్‌ను విదేశీ, OCI, ఎన్నారై అభ్యర్థుల సౌకర్యార్థం భారతదేశం వెలుపల 24 నగరాల్లో కూడా నిర్వహిస్తారు.అయితే విదేశీ, OCI, NRI అభ్యర్థులు వారు అడ్మిషన్ పొందాలనుకునే యూనివర్సిటీ, సంస్థ లేదా సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించి, అడ్మిషన్ విధానాలు, కోటా, కేటగిరీ, సడలింపు, రిజర్వేషన్‌లు, అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను సమీక్షించాలని జగదీష్ కుమార్ సూచించారు.
యూనివర్సిటీ లేదా సంస్థ విదేశీ, ఎన్నారై, OCI అభ్యర్థులకు వేర్వేరు ప్రవేశ విధానాలను కలిగి ఉండవచ్చు.కాబట్టి, అభ్యర్థులు విధానాలు, మార్గదర్శకాల కోసం వారి సంబంధిత సంస్థ వెబ్‌సైట్‌ను చెక్ చేయడం మంచిది.తద్వారా చాలా ఈజీగా అడ్మిషన్ పొందడం సాధ్యమవుతుంది.పుట్టిన గడ్డపై డిగ్రీ పట్టా పొందే అవకాశం లభిస్తుంది.