కాలం చాలా మారిపోయింది.దాంతోపాటు జనాలలో కూడా విపరీత మార్పులు వస్తున్నాయి.
ఒకప్పుడు మనకు ఏదన్నా వస్తువు కావాలంటే కాలినడకన సదరు షాప్ దగ్గరకు వెళ్ళి మరీ కొనుక్కొని తెచ్చుకొనే వాళ్ళం.కానీ ఇపుడు దానికి భిన్నమైన పరిస్తితులు వున్నాయి.
మరీ ముఖ్యంగా పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్( Oline Shopping ) చేసేవారు చాలామందే వుంటారు.అలాంటివారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్( Flipkart ) ఇపుడు సరికొత్త ఫీచర్ను పరిచయం చేస్తోంది.
అవును, కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా ‘ప్రైస్ లాక్’ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు.
ఈ సందర్బంగా ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ ( CPTO ) జయందరన్ వేణుగోపాల్( Jeyandran Venugopal ) ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో మాట్లాడుతూ… “పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది.దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్( Price Lock Feature )తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు” అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు.
అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు తీసుకొస్తారనేది మాత్రం ఇంకా ఓ క్లారిటీ లేదు.ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న ‘ప్రైస్ లాక్’ ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడని మర్చిపోవద్దు.ఆ తర్వాత పండుగ సమయాల్లో( Festive Offers ) ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు.అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు.