గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఫ్లెక్సీ వార్ రాజుకుంది.ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.ఈ దాడుల్లో ఐదుగురికి గాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.