తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్( Congress) ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది.
దీంతో త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా విజయం సాధించడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది.ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
అదేవిదంగా ఏపిపై ఫోకస్ పెట్టడం జరిగింది.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం అనంతపురం జిల్లాలో “న్యాయసాధన సభ”( Congress Nyay Sadhana Sabha ) పేరుతో కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది.
అనంతపురం పట్టణంలో న్యూ టౌన్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సాయంత్రం జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏపీపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి( YS Sharmila ) ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సభలో మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర ప్రజలకు కీలక హామీలు ప్రకటించారు.ఎన్నికలలో ఒక గ్యారెంటీ ఇవ్వటానికి వచ్చినట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయం గ్యారెంటీ ఇస్తాం.ప్రతి పేద కుటుంబానికి నెలకు 5వేల రూపాయలు ఇస్తామని వ్యాఖ్యానించారు.ఆంధ్ర ప్రజలకు పదేళ్లుగా అన్యాయం జరిగింది.
దేశం గర్వించే గొప్ప నాయకుడు.వైయస్ రాజశేఖర్ రెడ్డి.
అందుకే ఆ మహా నాయకుడి బిడ్డకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లు… షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.