అవును.సింగపూర్ లాంటి సిటీని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి.జీవితంలో అక్కడి అందాలను ఒక్కసారైనా చూడాల్సిందే.అధునాతన టెక్నాలజీతో కట్టిన కట్టడాలను చూస్తే ఔరా అనిపిస్తుంది.
అక్కడి విశాలమైన రోడ్లకు మన రోడ్లు ఎంత మాత్రమూ సరితూగవు.ఇక అక్కడి గవర్నమెంట్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది.
ఎన్నో దేశాలకు సింగపూర్ ఒక తలమానికం.అందుకేనేమో మాజీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంలో సింగపూర్ ని ఉదాహరణగా తీసుకున్నాడు.
అక్కడి అద్భుతమైన కట్టడాలను చూస్తే మనం చూపు తిప్పుకోలేం.ఎన్నో వైవిధమైన కట్టడాలకు సింగపూర్ నిలయం.ఇపుడు అదే వరుసలోకి చేరిపోతోంది ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్.అవును.
నీటిలో తేలియాడే ఒకవిధమైనటువంటి గుండ్రని ఆకారంగల స్టోర్‌ను ఆపిల్ అక్కడ ప్రారంభించనుంది.ఈ స్టోర్ పూర్తిగా నీటిలో తేలియాడే విధంగా వినూత్నంగా నిర్మించనున్నారు.
దీన్ని చూడటానికి మన రెండుకళ్ళూ సరిపోవు.

సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్ రిసార్ట్ వద్ద ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నీటిపై తేలియాడే ఏకైక రిటైల్ స్టోర్ కావడం విశేషం.పూర్తిగా క్రిస్టల్‌తో నిర్మించిన ఈ డోమ్ ఆకారంలోని భవనంలోనే ఇప్పుడు ఆపిల్ తన కొత్త స్టోర్‌ను ఓపెన్ చేయనుంది.
ఇక దీన్ని సందర్శించడానికి స్థానికులు వందల సంఖ్యలో గుమిగూడుతున్నారట.పగటిపూట, ఇది ఓ అంతరిక్ష నౌక లాగా.రాత్రి పూట మెరిసే తెల్లని బంతిపువ్వులాగా కనిపిస్తుందీ స్టోర్.