గుజరాత్ లో ఘోర అగ్నిప్రమాదం...21 మంది విద్యార్థులు మృతి

గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.గుజరాత్ లోని సూరత్ లో ఒక కోచింగ్ సెంటర్ లో భారీ గా మంటలు చెలరేగడం తో దాదాపు 21 మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

 Fire Accident In Gujarat 21 Students Died-TeluguStop.com

సూరత్ లోని ఒక వాణిజ్య భవనంలోని నాలుగో అంతస్తు లో ఈ కోచింగ్ సెంటర్ ఉంది.అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ మంటలు చెలరేగడం తో విద్యార్థులు ఏమి చేయాలో పాలు పోక కొందరు ప్రాణాలు కాపాడుకోవాలని పై నుంచి కిందకు దూకారు.

అయితే ఈ క్రమంలో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

మృతి చెందిన వారంతా కూడా 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారే.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….ఒక వాణిజ్య భవనంలో నిర్వహిస్తున్న కోచింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.అనంతరం దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించడం తో భవనంలోనే ఉన్న సుమారు 50 మంది విద్యార్థులు హాహాకారాలు చేశారు.

మంటలను అదుపు చేసేందుకు స్థానికులు తమ వంతు ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

-Telugu Political News

చివరికి మంటల నుంచి ప్రాణాలు కాపాడు కోవాలన్న ఆందోళనలో భవనం పైనుంచి పలువురు విద్యార్థులు దూకేశారు.వారిలో 21 మంది ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే ఇంకా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 19 ఫైర్ ఇంజన్లు ఉపయోగించారు ఫైర్ సిబ్బంది.మరోపక్క ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube