పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( Parliament Budget Sessions ) భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) 2024 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.ఆరోసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మధ్యంతర బడ్జెట్ కు కేంద్ర కేబినెట్( Central Cabinet ) ఆమోదం తెలిపింది.దీంతో డిజిటల్ విధానంలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.కాగా ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
సబ్ కా సాథ్.సబ్ కా వికాస్ తమ నినాదమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.ఈ క్రమంలోనే మళ్లీ గెలుస్తామని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం( Free Ration ) ద్వారా ఆహార సమస్యను పరిష్కరించామని తెలిపారు.
అలాగే సామాజిక న్యాయం తమ ప్రభుత్వం అనుసరించే విధానమని స్పష్టం చేశారు.