పార్లమెంట్ లో 2024 మధ్యంతర బడ్జెట్.. ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( Parliament Budget Sessions ) భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) 2024 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

ఆరోసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మధ్యంతర బడ్జెట్ కు కేంద్ర కేబినెట్( Central Cabinet ) ఆమోదం తెలిపింది.

దీంతో డిజిటల్ విధానంలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.కాగా ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

"""/" / సబ్ కా సాథ్.సబ్ కా వికాస్ తమ నినాదమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఈ క్రమంలోనే మళ్లీ గెలుస్తామని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం( Free Ration ) ద్వారా ఆహార సమస్యను పరిష్కరించామని తెలిపారు.

అలాగే సామాజిక న్యాయం తమ ప్రభుత్వం అనుసరించే విధానమని స్పష్టం చేశారు.

ప్రణయగోదారి సినిమా రివ్యూ!