పొత్తు ఫైనల్ స్టేజ్.. సందిగ్ధంలో జగన్ ?

ఏపీ రాజకీయాల్లో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.గత కొన్నాళ్లుగా టిడీపి, జనసేన, బీజేపీ( TDP, Jana Sena, BJP ) పార్టీల మద్య పొత్తు వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది.

 Final Stage Of Alliance Jagan In Dilemma , Jagan, Tdp, Jana Sena, Bjp , Ycp, Cha-TeluguStop.com

మూడు పార్టీలు ఒకే ఎజెండాతో ఉన్నప్పటికి సమన్వయలోపంతో ఈ మ్దు పార్టీలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి.ఇప్పటికే జనసేన మరియు బీజేపీ పార్టీలు పొత్తులో ఉండగా టీడీపీ కూడా ఈ రెండు పార్టీలతో కలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

టీడీపీతో కలవడానికి జనసేన సిద్దంగానే ఉన్నప్పటికి బీజేపీ మాత్రం వెనుకడుగు వేస్తోంది.అయితే ఏపీలో బలమైన వైసీపీని గద్దె దించాలంటే విడివిడిగా పోటీ చేస్తే పరాభవం మూటగట్టుకోక తప్పదు.

ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పవన్.వైసీపీ( YCP ) వ్యతిరేక ఓటు చిలనివ్వనని పొత్తులకు తను సిద్దమే అని తేల్చి చెప్పారు కూడా.

Telugu Ap, Chandrababu, Dilemma, Finalstage, Jagan-Politics

కానీ బీజేపీ మరియు టీడీపీ మద్య సమన్వయ లోపం కారణంగా ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి.దీనికి కారణం 2019 ఎన్నికల ముందు జరిగిన పరిణామలే.2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో విభేదించి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది.అంతే కాకుండా ఆ సమయంలో మోడీ పై చంద్రబాబు( Chandrababu ) చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.

అప్పటి నుంచి టీడీపీకి దూరం పాటిస్తూనే ఉంది బీజేపీ.ఇప్పుడు కూడా టీడీపీతో విభేదిస్తూనే ఉంది.కానీ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటలంటే టీడీపీతో కలయిక చాలా అవసరం.

Telugu Ap, Chandrababu, Dilemma, Finalstage, Jagan-Politics

ఆ మద్య పవన్ మాట్లాడుతూ టీడీపీ మరియు బీజేపీ మద్య కొన్ని విషయాల్లో అభ్యంతరాలు ఉన్నాయని త్వరలోనే వాటిని పరిష్కరించుకొని పొత్తుకు రెడీ అవుతాయని పవన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రెండు పార్టీల మద్య సమస్య పరిష్కారం అయినట్లు కనిపిస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా అమిత్ షా తో భేటీ అయ్యారు.

ఈ బేటీలో టీడీపీ మరియు బీజేపీ మద్య పొత్తు అంశం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.ఇదే గనుక జరిగితే ఏపీలో 2014 కూటమి రిపీట్ అవుతుంది.

ఈ పొత్తు వైసీపీని గట్టిగా దెబ్బ తీసే అవకాశం ఉంది.పొత్తు లేకుండా సింగిల్ గా బరిలో దిగాలని వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికి మూడు పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేస్తుండడంతో ఈసారి ఏపీ ఎలక్షన్స్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube