యువతిని చెంప దెబ్బలు కొట్టిన లేడీ టికెట్ ఎగ్జామినర్లు.. వీడియో వైరల్‌..

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) రైల్వే స్టేషన్‌లో మహిళా టిక్కెట్ ఎగ్జామినర్లు (టీటీఈ) ఒక లేడీ ప్యాసింజర్‌పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది.ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లో ఉన్నవారు ఆ యువతిపై రైల్వే సిబ్బంది చేయి చేసుకున్న దృశ్యాలను రికార్డ్ చేశారు.

 Female Railway Ttes Hold Collar Of Girl Slap And Drag Her In Uttar Pradesh Detai-TeluguStop.com

ఈ వీడియోలో టీటీఈలు( TTE ) ప్రయాణికురాలిని ఆమె కాలర్ పట్టుకుని, చెంపదెబ్బ కొట్టి, స్టేషన్ మాస్టర్ ఆఫీస్ వైపు లాగడం కనిపించింది.సదరు యువతి వీరి దెబ్బల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

వాగ్వాదానికి కారణం తెలియ రాలేదు.అయితే కొన్ని నివేదికలు టికెట్ విషయంలో( Ticket ) యువతి కొట్టి ఉంటారని తెలుపుతున్నాయి.నల్లకోటు, గుర్తింపుకార్డులు ధరించి వచ్చిన టీటీఈలు ఎలాంటి సంయమనం, గౌరవం చూపలేదు.ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది, చాలా మంది వ్యక్తులు టీటీఈల దుర్వినియోగం, వృత్తిపరమైన ప్రవర్తనను ఖండించారు.

ప్రయాణికుడిని( Passenger ) నేరస్థుడిగా కాకుండా కస్టమర్‌గా భావించాలని, ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా చేయి చేసుకోకూడదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైలు మంత్రిత్వ శాఖ( Rail Ministry ) టీటీఈలపై చర్యలు తీసుకుని ప్రయాణికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అయితే, ఈ వీడియో మొత్తం కథనాన్ని చూపించకపోవచ్చని, ఆ ప్రయాణికురాలు టీటీఈలను ఏదో విధంగా రెచ్చగొట్టి ఉండవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.మొత్తం మీద ప్రజలను వేధించకుండా ప్రజలకు సేవ చేయాల్సిన టీటీఈలు విచక్షణ కోల్పోయి, అంగీకరించని విధంగా ప్రవర్తించి ప్రస్తుతం చాలామంది ఆగ్రహానికి గురవుతున్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube