దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఇంటిలో చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు పిల్లలు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు.దీనికి సంబంధించి చిన్నారుల తండ్రిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రకటించింది.
లాస్ ఏంజిల్స్ నగరానికి ఉత్తరాన వున్న యాంటెలోప్ వ్యాలీలోని లాంకాస్టర్‌లోని ఓ ఇంటిలో కాల్పులు జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ఇంటిలో ఓ మహిళ, నలుగురు పిల్లల మృతదేహాలు కనిపించాయని షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
మృతుల్లో ఒక మహిళ, ఒక బాలిక, ముగ్గురు బాలురు వున్నారు.వీరంతా తుపాకీ గాయాలతో మరణించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.మృతులంతా ఘటనాస్థలంలోనే మరణించినట్లుగా పోలీసులు చెప్పారు.
పిల్లలంతా 12 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది.చిన్నారుల తండ్రిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది.అయితే అతనిని ఎప్పుడు అరెస్ట్ చేసింది, తదితర వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.అలాగే బాధితుల పేర్లు కూడా కొన్ని కారణాల వల్ల బయటకు చెప్పలేదు.
కాగా.
రెండురోజుల క్రితం టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఇద్దరు టీనేజర్లు వున్నారని పోలీసులు తెలిపారు.అంతేకాదు కాల్పులకు గురైన ఆరుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారని వెల్లడించారు.
వీరి వయసు 13 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.45 గంటల మధ్య జరిగి వుంటుందని మెట్రోపాలిటన్ నాష్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ ట్వీట్‌లో పేర్కొంది.మరణించినవారిని షెరెల్ (18), టవేరియస్ షెరెల్ (15)గా గుర్తించారు.
వీరి తల్లి (40), ఇద్దరు అక్కలు, సోదరుడు (13) కూడా ప్రమాదంలో గాయపడ్డారు.క్షతగాత్రులను నాష్‌విల్లేలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు పోలీసులు.
ప్రస్తుతం వారి పరిస్ధితి నిలకడగా వుందని సమాచారం.