బహిరంగంగా మూత్రం పోసిన వ్యక్తి నుండి లంచం తీసుకున్న హోం గార్డులు... కాకపోతే చివరకు...?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన బహిరంగంగా మూత్రం పోసే కారణంతో నలుగురు హోంగార్డులు వ్యక్తి నుంచి రూ.2500 రూపాయలు లంచంగా తీసుకున్న సంఘటన ఒకటి బయటకు వచ్చింది.అయితే ఆ నలుగురు హోంగార్డులు నిజమైన పోలీసులు కాదు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడని ఓ నలుగురు హోంగార్డులు ఆ విషయంలో అతని దగ్గరకి వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని పిలిచారు.ఇక అక్కడ అతనిపై కేసు పెట్టి జైలుకు పంపించాలని ఆ నలుగురు దొంగ పోలీస్ కానిస్టేబుల్ గుసగుసలాడుతుండగా, ఇది గమనించిన ఆ వ్యక్తి తనని వదిలేసేంకు రూ.2500 ఇవ్వడానికి సిద్దపడ్డాడు.ఇక ఆ మొత్తాన్ని దొంగ హోంగార్డులకు ఇచ్చి దేవుడా అని అక్కడి నుంచి బయట పడ్డాడు.

 Fake Home Guards Bribes Common Man Who Toilet Publicly, Arrest, Bathroom, Police-TeluguStop.com

ఆశుతోష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.ఇలా ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డులో మూత్ర విసర్జన చేయడంతో అక్కడే ఉన్న నలుగురు దొంగ హోంగార్డులు అతన్ని బెదిరించారు.

ఈ నేపథ్యంలోనే వారు పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలువగా అందుకు సంతోష్ హోంగార్డులను ఎందుకు రావాలని ప్రశ్నించాడు.అలా వారి మధ్య బేరసారాలు సాగిన తర్వాత చివరకు 2500 ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు అశుతోష్.

అయితే ఎందుకో అనుమానం వచ్చిన అతడు కొద్ది దూరం వెళ్ళాక పెట్రోలింగ్ వాహనం కనపడటంతో వారికి హోంగార్డుల మధ్య జరిగిన సంభాషణ విషయం మొత్తం తెలిపారు.

ఈ పూర్తి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా పోలీస్ డ్రెస్ వేసుకున్న నలుగురు హోంగార్డులు వారి కంట పడ్డారు.ఇక వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ఇద్దరు తప్పించుకొని కనపడకుండా వెళ్ళిపోయారు.ఇక మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నలుగురు వ్యక్తులు ఇదివరకే 2015లో ఇలాంటి నేరాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించాలని పోలీసులు తెలియజేశారు.అయినా వారు తమ పద్ధతిని మార్చుకోలేదని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube