Rana Naidu : సోషల్ మీడియా వల్లే ఓటిటి కి కాసుల వర్షం కురుస్తుందా ?

సోషల్ మీడియా ఎప్పుడు రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

పాజిటివ్ గా హైట్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే నెగటివ్ గా మరింత హైప్ క్రియేట్ చేయడం మరొక వంతు.

ఏ విషయానికైనా కూడా నెటిజెన్స్ స్పందిస్తూ ఉంటారు.పాజిటివ్ గా లేదంటే నెగటివ్ గా స్పందించడం వారికి అలవాటే.

న్యూట్రల్ గా ఉండే ప్రేక్షకులు చాలా అరుదుగా ఉంటారు.అయితే ఎలాగైనా సరే పాపులారిటీ రావాలనుకుని సోషల్ మీడియాలోకి ఎక్కే వారు కొందరైతే చెత్త సినిమాలు సరికొత్త చెత్త విషయాలను సోషల్ మీడియాలోకి పంపిస్తూ వాటికి హైప క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే.అందుకే చాలా రోజులుగా సోషల్ మీడియా(Social media ) చాలా స్ట్రాంగ్ గా పని చేస్తుంది.

ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే కచ్చితంగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు బాగుంది అని అనిపిస్తే అది వంద రెట్లు బాగుండేలా సోషల్ మీడియా మరింత ప్రమోట్ చేస్తూ ఉంటుంది.ఒకవేళ బాగా లేదు అనుకోండి దాన్ని కూడా 1000 రేట్లు మరింత నెగటివ్ గా పబ్లిసిటీ చేస్తుంది.అయితే విషయం చూడాలని డిసైడ్ అయిన ప్రేక్షకులు ఎంత చెత్త కంటెంట్ అయినా చూస్తారు.

Advertisement

అందుకు సరైన ఉదాహరణ వెంకటేష్ మరియు రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్( Rana Naidu) ఇప్పుడు కేవలం సినిమాలు తీస్తే మార్కెట్ పెద్దగా లేదు అందుకే ఓటిటి పైన ప్రతి ఒక్క స్టార్ ఫోకస్ చేస్తున్నారు ఆ దోవలోనే రానా ముందు నుంచి తిక్క తిక్క వేషాలు(Rana) వేయడం అలవాటే కాబట్టి ఈ జనాలకు పెద్ద ఆయన విషయంలో అంచనాలు లేవు.

కానీ వెంకటేష్ అంటే ఒక రేంజ్ ఉంది ఫ్యామిలీ హీరోగా అభిమానులు ఉన్నారు.లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా భారీగా ఉంటుంది ఇలాంటి తరుణంలో వెంకటేష్ నోరు తెరిస్తే బూతులు మాట్లాడే కంటెంట్ తీయడంతో ప్రతి ఒక్కరు అసహనం వ్యక్తం చేస్తూనే ఎందుకు చూస్తున్నారు అనే విషయమే మనం ఇక్కడ ఆలోచించాలి.అది ఎంత చెత్త కంటెంట్ అయినా సరే బూతు కంటెంట్ అయినా సరే బాగుందో బాగోలేదు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉండడంతో నెగటివ్ పాపులారిటీ బాగా పెరిగిపోయి ప్రస్తుతం అది ట్రెండింగ్ లో ఉంది.

తీసిన ప్రొడ్యూసర్ కి కలెక్షన్స్ ఫుల్లుగా వస్తే చాలు అది ఏ కంటెంట్ అయితే పోయేదేముంది అన్న రకంగా తయారయ్యారు ప్రస్తుతం ఇండస్ట్రీ వారు.అందుకే సెన్సార్ లేని ఓటీడీకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోవడంతో పాటు జనాకర్షణ పెరుగుతుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు