చిన్న మధ్య తరహా వ్యాపారులు (ఎస్.ఎం.
బీలు)కు మద్దతివ్వడం లక్ష్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.ఫేస్ బుక్ పై ప్రకటనలు ఇస్తే త్వరితగతిన రుణాలు పొందేలా కొత్త ప్రోగ్రామ్ స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనీషియేటవ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఆన్ లైన్ రుణ ప్లాట్ ఫామ్ ‘ఇండిఫి‘ భాగస్వామితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.ఈ కార్యక్రమంతో స్వతంత్ర రుణ భాగస్వామి నుంచి చిరు వ్యాపారస్తులు రుణాలు పొందవచ్చు.
కాగా ఈ కార్యక్రమాన్ని తొలత భారత్ లోనే అమలు చేస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.భారత్ లో 200పైగా పట్టణాలు, నగరాల్లో బిజినెస్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఫేస్ బుక్ భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి కంపెనీ ‘ఇండిఫి’కాగా మరింత భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఫేస్ బుక్ సిద్ధంగా ఉంది.చిరు వ్యాపారులు మరింత సులభంగా వ్యాపార రుణాలను పొందడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఫేస్ బుక్ పేర్కొంది.
ఫేస్ బుక్ పై ప్రకటనలు ఇచ్చే కంపెనీలు ఇండిఫి ద్వారా 15 నుంచి 20 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణాలు పొందొచ్చు.