Bhola Shankar : భోళా శంకర్ డిజాస్టర్ వారందరికీ కళ్ళు తెరిపించిందా.. ఇకనైనా సినిమా వారు మారతారా…

భోళా  శంకర్ సినిమా( Bhola Shankar ) ఫ్లాప్ కావడం తెలుగు సినిమాకు ఒక కనువిప్పు అని చెప్పవచ్చు.సినిమా బాగోలేకపోతే పెద్ద స్టార్లు కూడా హిట్ కొట్టలేరని తేలిపోయింది.

 Eye Opening Facts About Bhola Shankar Disaster-TeluguStop.com

ఈ సినిమా ఫెయిల్యూర్ వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలిగాయి.అదేంటంటే, కథ లేకుండా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎవరూ చూడరనేది అర్థమైంది.

చిరంజీవి( Chiranjeevi ), కీర్తి సురేష్, తమన్నా లాంటి హీరో హీరోయిన్లు ఉన్నా భోళా శంకర్ ఫ్లాప్ అయింది.ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఫెయిల్యూర్‌కి అతీతం కాదని, మంచి సినిమాలను అందించడానికి కష్టపడాల్సిన అవసరం ఉందని ఈ మూవీ రిజల్ట్ తో తేలిపోయింది.


Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Original Story, Telugu Audience

ఇది నిర్మాతలకు కూడా ఎంతో విలువైన గుణపాఠం అయ్యింది.కొంతమంది నిర్మాతలు స్క్రిప్ట్ నాణ్యతతో సంబంధం లేకుండా హీరోల రెమ్యునరేషన్‌ను భారీ స్థాయికి పెంచుతున్నారు.అయితే భోళా శంకర్ ఫెయిల్యూర్‌( Bhola Shankar Failure )తో సినిమా హిట్ కావడానికి హీరోకి ఉన్న స్టార్ పవర్‌ మాత్రమే సరిపోదని వారికి తెలిసిపోయింది.మంచి కథలకు మాత్రమే గిరాకీ ఉందని అర్థమయ్యేలా చేసింది.

హీరోలను కాకుండా కథను నమ్ముకుంటేనే బయటపడగలమని చెప్పకనే చెప్పింది.ఇక ఇటీవ‌ల కాలంలో సౌత్ ఇండియా సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తుంది.

అయితే భోళా శంకర్ ఫెయిల్యూర్ వల్ల ఒరిజినల్ స్టోరీలకే డిమాండ్( Original Stories ) ఎక్కువ, రిస్కు తక్కువ అని తేలింది.ఒక హిట్ సినిమాని రీమేక్ చేసినప్పుడు ప్రేక్షకులు ఒరిజినల్ తో కంపేర్ చేస్తూ ఏమాత్రం తేడా వచ్చినా ఏకిపారేస్తున్నారు.

అందుకే ఒకవేళ రీమేక్ చేసినా ఒరిజినల్ కంటే మంచిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.


Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Original Story, Telugu Audience

గతంలో పెద్ద హీరోలు నటించారనే కారణంతో సినిమా చూసేవారు.కానీ ఇప్పుడు వీరాభిమానులు తప్ప మిగతా ప్రేక్షకులు సినిమా బాగోలేకపోతే నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు.భోళా శంకర్ ఫెయిల్యూర్ తెలుగు సినిమా ప్రేక్షకుల( Telugu Audience ) అభిరుచి మారుతుందనడానికి సంకేతం.

ఇక సినిమాల్లో పెద్ద స్టార్ ఉంటే సరిపోదు.సినిమా కూడా బాగుండాలి.

తెలుగు సినిమా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలంటే మంచి కథలు, బలమైన పాత్రలతో మరిన్ని సినిమాలు నిర్మించాలి.చిరంజీవి కూడా అతని మేనరిజం ఒక్కటే సినిమాని కాపాడుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube