హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సచివాలయ ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అభ్యర్థులు ఒక్కసారిగా మెయిన్ గేట్ వద్దకు దూసుకొచ్చారు.జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసనకు దిగారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.