ఏలియన్స్ ఉనికి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ నాసా సైంటిస్ట్...

గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల( Aliens, UFOs ) ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ , వివాదాస్పద అంశం అని చెప్పుకోవచ్చు.చాలా మంది వ్యక్తులు వాటిని చూసినట్లు లేదా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెప్పుకుంటారు, మరికొందరు వాటిని ఫిక్షనల్ స్టోరీలుగా అనుమానిస్తారు లేదా కొట్టివేస్తారు.

 Ex-nasa Scientist Makes Shocking Comments About Aliens' Existence, Aliens, Ufos,-TeluguStop.com

ఈ మిస్టరీలో మనకు తెలిసిన దానికంటే ఎక్కువ ఉందని సూచించే కొన్ని ఆవిష్కరణలు కూడా ఉన్నాయి.ఆ ఆవిష్కరణలలో ఒకదాన్ని తాజాగా మాజీ నాసా శాస్త్రవేత్త వెల్లడించారు.

మన గ్రహంలోని మహాసముద్రాలలో గ్రహాంతరవాసులు నివసిస్తున్నారని ఆయన ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Alien Activity, Aliens, Deep Sea Bases, Kevin Knuth, Nasa Scientist, Ocea

సముద్రపు అడుగుభాగంలో గ్రహాంతరవాసుల కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని వింత సొరంగాలను నాసా( NASA ) కనుగొందట.గ్రహాంతరవాసుల గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియకుండా నాసా దాస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేసిన పరిశోధకుడు కెవిన్ నూత్( Kevin Nooth ), గ్రహాంతరవాసులపై తనకున్న నమ్మకం గురించి బహిరంగంగా మాట్లాడే కొద్దిమందిలో ఒకరు.

ఆయన రీసెంట్‌గా థియరీస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ( Theories of Everything )అనే పాడ్‌కాస్ట్‌లో గ్రహాంతరవాసులు మనుషుల నుంచి దాచుకోవడానికి, మనుషులను గమనించడానికి సముద్రాలు ఉత్తమమైన ప్రదేశం అని చెప్పాడు.

Telugu Alien Activity, Aliens, Deep Sea Bases, Kevin Knuth, Nasa Scientist, Ocea

గ్రహాంతరవాసులు చాలా తెలివైనవారని, నీటి గ్రహం నుంచి వచ్చి ఉండవచ్చని అతను అభిప్రాయపడ్డారు.భూమి ఉపరితలంలో 75 శాతం మహాసముద్రాలు ఆక్రమించాయని, వాటిని ఎవరూ పూర్తిగా అన్వేషించలేదని నత్ చెప్పారు.గ్రహాంతరవాసులు లోతైన సముద్రంలో స్థావరాన్ని నిర్మించుకుని రహస్యంగా నివసిస్తున్నారని అతను భావిస్తున్నాడు.

భూమిపై గ్రహాంతర జీవులకు ఇది ఆమోదయోగ్యమైన దృశ్యమని ఆయన అన్నారు.నాసా మాజీ సైంటిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

గ్రహాంతరవాసులు నీటిలో ఉన్నాయని చెప్పిన మొదటి సైంటిస్ట్ కెవిన్ నూత్.ఇప్పటిదాకా సినిమాల్లో కూడా ఏలియన్స్‌ నీటిలో బతుకుతాయని చూపించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube