లెబనాన్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది.పర్యవసానంగా ఆ దేశం అంధకారంలో మునిగింది.
ఇంధనం కొరత కారణంగా ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.దేశ ప్రధాన పవర్ స్టేషన్ లో ఇంధనం లేక అవి పనిచేయక లెబనాన్ ఎలక్ట్రిక్ గ్రిడ్ షట్ డౌన్ అయినట్లు స్కై న్యూస్ వెల్లడించింది.
శనివారం నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.పరిస్థితి మెరుగు పడాలంటే ఇంకా చాలా రోజులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా.అల్ జహఆ్రని, రియల్ అమ్మాయ్ పవర్ స్టేషన్లు నిలిచి పోయాయి.50 శాతానికి పైగా విద్యుత్ అవసరాన్ని ఈ పవర్ స్టేషన్లు తీరుస్తాయి.లెబనాన్ ఆర్థిక సంక్షోభం వల్ల ఇంధన కొరత ఏర్పడిందని పర్యవసానంగా విద్యుత్ కోతలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నట్లు అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది.
ఈజిప్ట్ నుంచి లెబనాన్ వరకు అంతర్ దేశ గ్యాస్ పైప్ లైన్ పునరుద్ధరణకు అమెరికా దౌత్యాధికారి చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఈ సమస్య పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.అయితే ఇది కొత్త ఆలోచన కాదని 2009- 2010 నుంచి ఈజిప్ట్ నుంచి జోర్డాన్ కు సిరియా నుంచి లెబనాన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని లెబనాన్ ఆయిల్ గ్యాస్ బోర్డు సభ్యులు డయానా కైస్సీ వెల్లడించారు.

ఈజిప్టులో పైప్ లైన్ పై దాడులు, లెబనాన్ చెల్లింపులు ఎగ్గొట్టిన నేపథ్యంలో అరబ్ గ్యాస్ పైప్ లైన్ వినియోగం నిలిచిపోయింది.సిరియా యుద్ధం కారణంగా పైప్ లైన్ కు ఎంత మేరకు నష్టం వాటిల్లిందని పై అధ్యాయాలు జరపాలని నిపుణులు అంటున్నారు.అయితే ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయొచ్చని క్రైసీ అన్నారు.ఇదిలా ఉంటే ఈజిప్ట్, లెబనాన్, సిరియా జోర్డాన్ ఇంధన మంత్రులు అమ్మన్ లో సమావేశమయ్యారు.లెబనాన్ కు గ్యాస్ సరఫరాపై సానుకూలత వ్యక్తం చేశారు.గ్యాస్ కోసం నిధులను సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందని అధికారులు వెల్లడించారు.